Take a fresh look at your lifestyle.

సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుకమ్మ ఆటపాటలతో నిరసన

ప్రగతిన్యూస్, తెలంగాణ, భద్రాద్రికొత్తగూడెం జిల్లా: సమగ్ర శిక్ష అభియాన్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ కానీ, టైం స్కేలు ఇవ్వాలని కోరుతూ తదితర డిమాండ్లతో గత ఎనిమిది రోజుల నుంచి చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద బతుకమ్మ ఆటపాటలతో నిరసన తెలిపారు. మహిళా ఉద్యోగులు బతుకమ్మలను పేర్చి తీసుకొని వచ్చి మరి బతుకమ్మ పాటలు పాడుతూ సీఎం కేసీఆర్ స్పందించి తమ సమస్యలను డిమాండ్లను అంగీకరించి తిరిగి వీధిలోకి తీసుకోవాలని అప్పటివరకు ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని ఆటపాటలతో తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు మోహన్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్న తమకు కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా పెట్టి చాకిరి చేయించుకుంటున్నారని, రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఎక్కువగా కష్టపడుతున్న కూడా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వకుండా శ్రమను దోపిడీ చేసుకుంటుందని ఆరోపించారు. తమ న్యాయమైన కోరికలను నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్న తాత్పర్యం చేస్తూ వస్తున్నారని తప్ప ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించి మా డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు భూక్యా. మోహన్, ప్రధాన కార్యదర్శి బట్టు చందర్ లాల్, నాయకులు కిరణ్మయి, సురేష్, నాగేశ్వరరావు, దుర్గ, సేవ్యా, విజయ్, భాస్కర్, కిషన్, దాసరాజు, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Post bottom
Leave a comment