Take a fresh look at your lifestyle.

దొంగతనాలు నివారించండి, పోలీస్ వారికి సహకరించండి

ప్రగతిన్యూస్, తెలంగాణ, భద్రాచలం: జిల్లా ఎస్పీ డా.వినీత్.జి మేరకు భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ప్రజలు 8712682106 నంబరుకు వాట్సాప్ ద్వారా వారి పూర్తి వివరాలు, కాంటాక్ట్ నంబర్ ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఊరికి వెళ్తున్నారో మరియు గూగుల్ లొకేషన్ ను పంపించడం ద్వారా ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసు బీట్ పెట్రోలింగ్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏఎస్,పి భద్రాచలం, పరతోష్ పంకజ్, ఐపీఎస్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేసారు.భద్రాచలం రాష్ట్ర సరిహద్దు లలో ఉన్నందున, దొంగతనాలను అరికట్టడంలో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేసారు. సాధ్యమైనంత వరకు విలువైన వస్తువులను,ఆభరణాలను తమ ఇండ్లలో ఎట్టి పరిస్థితుల్లో వదిలి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.కావున దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోలీసు వారికి సమాచారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Post bottom
Leave a comment