Take a fresh look at your lifestyle.

ప్రజావాణి దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్.

 

 ప్రగతిన్యూస్,తెలంగాణ,కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా : ప్రజావాణి దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారులు చేసుకున్న దరఖాస్తుల పరిష్కారం, తిరస్కరణ వివరాలను సంబంధిత అర్జీదారుడికి లిఖితపూర్వకంగా తెలియపరచాలని అన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, పెండింగ్లో ఉన్న వాటి వివరాలను ప్రతిరోజు నివేదిక అందించాలని, ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను వారంలోగా పరిష్కరించే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరు అయిన అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్ నగర్ ఆర్ డి ఓ సురేష్ తో కలిసి జిల్లాలోని అన్ని మండలాల తహసిల్దార్లు, నాయక్ తహసిల్దార్లతో ప్రజావాణి దరఖాస్తుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అధికంగా భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తులు వస్తున్నాయని, మండల స్థాయిలో ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని, మండల పరిధిలో లేని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ధరణి సంబంధించి వచ్చే దరఖాస్తులపై తహసిల్దార్లు ప్రత్యేక దృష్టి సారించి పెండింగ్లో ఉన్న వాటిపై వెంటనే పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణిలో దరఖాస్తులు, ధరణిలో వచ్చే ఐచ్చికాలపై పూర్తిగా విచారణ జరిపి వాస్తవ నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల కొరకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తహసిల్దార్లు, నాయబ్ తహసిల్దార్లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Post bottom
Leave a comment