Take a fresh look at your lifestyle.

దమ్ము దగ్గుతో నిండు గిరిజన గర్భిణి మృతి

ప్రగతి న్యూస్,జైనూర్:
కొమరం భీ0 అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని దుబ్బగూడ పంచాయతీలో గల లక్ష్మణ్ పటేల్ గూడ గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మి (30) అనే గిరిజన నిండు గర్భిణీ దమ్ము, దగ్గుతో అకస్మాత్తుగా మంగళవారం మృతి చెందింది. బంధువుల సమాచారం మేరకు నిండు గర్భిణీ లక్ష్మీకి దమ్ము దగ్గు అధికం కావడంతో జైనూర్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ వైద్య ఉద్యోగులు పరీక్షించి ఆక్సిజన్ ద్వారా 108లో మెరుగైన వైద్యం కోసం ఉట్నూర్ ఆసుపత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతూ ఒకేసారి దమ్ము దగ్గు రావడంతో అకస్మాత్తుగా మృతి చెందిందని తెలిపారు. ఆత్రం లక్ష్మికి మొదటి కాన్పులో కూడా శిశువు మరణించిందని రెండవ కాన్పులో కూడా ఆమె మృతి చెందిందని తెలిపారు. ఉగాది నూతన పండుగ రోజు ఆమె మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతురాలు కుటుంబాన్ని సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షులు మడవి భీమ్రావు గ్రామ పటేల్ లక్ష్మణ్ పటేల్, నాయకులు పరామర్శించారు.

- Advertisement -

Post bottom
Leave a comment