Take a fresh look at your lifestyle.

జైనూర్ ఆస్పత్రి తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

ప్రగతి న్యూస్: జైనూర్, కొమరం భీ0 ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం కొమరం భీం అసిఫాబాద్ జిల్లా రెవెన్యూ విభాగ0 అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్య సేవలు ఇతర విషయాలపై వైద్యాధికారి నాగర్ గొంజ్ అశోక్ , వైద్య ఉద్యోగులతో అడిగి తెలుసుకున్నారు. మండలంలో వ్యాధుల పరిస్థితులు, ఆసుపత్రిలో వైద్య ఉద్యోగుల ఖాళీలపై అడుగగా వైద్య అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయ్ వైద్యాధికారి అశోక్ వైద్య ఉద్యోగులు వివరించారు. దీంతో అడిషనల్ కలెక్టర్ స్పందించి వైద్య అధికారుల నియామకం చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనూర్ తాసిల్దార్ తిరుపతి, వైద్య అధికారి అశోక్, సూపర్వైజర్ సాంబలక్ష్మి, వైద్య ఉద్యోగులు పాల్గొన్నారు.

- Advertisement -

Post bottom
Leave a comment