Take a fresh look at your lifestyle.

సినీ పక్కిలో నగదు చోరీ…

ప్రగతి న్యూస్, డిజిటల్ మీడియా, ఇచ్చాపురం…

ఇచ్ఛాపురం పట్టణంలోని దాసన్నపేట వద్ద సినీ ఫక్కీలో బుధవారం చోరీ జరిగింది. స్కూటీ డిక్కీలోని రూ.3.50 లక్షలు గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. వివరాల్లోకి వెళ్తే… దాసన్నపేటలో నివాసం ఉంటున్న సింగంశెట్టి శ్రీను బియ్యం వ్యాపారం చేస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం అనంతరం ఇంటి పక్కనే ఉన్న యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకులో రూ.3.50 లక్షల నగదును విత్‌ డ్రా చేసి చేసి, తన స్కూటీలోని డిక్కీలో పెట్టి తాళం వేశాడు. తన షాపునకు వెళ్లి అక్కడ స్కూటీని పార్కింగ్‌ చేశాడు. పది నిమిషాల తర్వాత స్కూటీ వద్దకు వచ్చేసరికి డిక్కీ తెరిచి ఉంది. అందులో పెట్టిన నగదు లేకపోవడంతో, లబోదిబోమంటూ పోలీసులకు పిర్యాదు చేశాడు. ఘటనపై గురువారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Post bottom
Leave a comment