Take a fresh look at your lifestyle.

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణ, కొమురం భీం ఆసిఫాబాద్,ఉచిత  వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సిర్పూర్ పేపర్ మిల్లు చీఫ్ మేనేజర్ రమేష్ రావు అన్నారు శనివారం రోజున

కాగజ్ నగర్ మండలం లో కొత్త సర్సాల గ్రామ పంచాయతీ లో స్పర్శ ఫౌండేషన్, సిర్పూర్ పేపర్ మిల్లు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మిల్లు చీప్ మ్యానేజర్ రమేష్ రావు శనివారం రోజున తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించడమే స్పర్శ ఫౌండేషన్ యొక్క లక్ష్యం కావున వైద్య సేవలు గ్రామ ప్రజలు అందరూ తప్పకుండా ఉపయోగించు కోవాలని తెలిపారు.ఈ వైద్య శిబిరం లో డాక్టర్ భాను ప్రకాష్ పేపర్ మిల్లు వైద్య సిబ్బంది గ్రామం లోని ప్రజలకు వివిధ రకాల పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్పర్శ ఫౌండేషన్ మ్యానేజర్ రీణ‌‌‌ బివాల్ మిల్లు ప్రతినిధి తుమ్మ రమేష్, నాగేశ్వరరావు శివ కుమార్ గ్రామ యువత పుల్లా అశోక్, పుల్లా శ్రీకాంత్ కార్యదర్శి మహేష్ సురేందర్ ,మిల్లు హాస్పిటల్ సిబ్బంది సిస్టర్ రేఖా,శ్రీవాణి తన్నీరు విజయ్ గ్రామ ప్రజలు మొదలైన వారు పాల్గొన్నారు.

- Advertisement -

Post bottom
Leave a comment