Take a fresh look at your lifestyle.

రేపే టీజీ ఈసెట్‌ ఫలితాలు

ప్రగతిన్యూస్,డిజిటల్ మీడియా,తెలంగాణలో ఈసెట్‌ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. 

మసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాల యంలో చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి మధ్యాహ్నం 12.30 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈసెట్ కన్వీనర్ పి చంద్రశేఖర్ ప్రకటించారు. 

పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈసెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఈసెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.

Ecet ఫలితాల కోసం ఈ వెబ్‌సైట్ https://ecet.tsche.ac.in/ లాగిన్ చేయండి. 

టీఎస్ ఈసెట్ ప్రవేశ పరీక్ష ను మే 6న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్‌లై న్‌లో నిర్వహించారు.ఈ పరీక్షకు తెలంగాణ జిల్లాల్లో 48, హైదరాబాద్ రీజియన్‌లో 44, ఏపీలో 7 కేంద్రాలు మొత్తం 99 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 24 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు…

- Advertisement -

Post bottom
Leave a comment