Take a fresh look at your lifestyle.

కాజిపేట్ – కాగజ్ నగర్ మధ్య నడిచే రైళ్లు రద్దు.

కాజిపేట్ – కాగజ్ నగర్ మధ్య నడిచే రైళ్లు రద్దు.

ప్రగతిన్యూస్, డిజిటల్ మీడియా, తెలంగాణ, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కాజీపేట-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య రామగుండం నుంచి నడిచే ప్యాసింజర్, సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లను నెలరోజుల పాటు రద్దు చేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. సాంకేతిక కారణాలతో శనివారం నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. కొన్నింటిని దారి మళ్లిం చారమని, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపిస్తామని వివరించారు.

నేటినుంచి అమలులోకి.. నెలపాటు రద్దయిన రైళ్లు ఇవే..

రైలు నంబరు 17003 కాజీపేట-కాగజ్నగర్ : ఈనెల 17వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు రద్దు చేశారు.

రైలు నంబరు12757/58: కాగజ్నగర్ ఎక్సప్రెస్ : ఇరువైపులా ఈనెల 23 నుంచి జూలై 6వ తేదీ వరకు రద్దు.

రైలు నంబరు 12967 చెన్నై- జైపూర్ జైపూర్ ఎక్స్ప్రెస్ : ఈనెల 23, 25, 30, జూలై 2, 7వ తేదీల్లో రద్దు చేశారు.

రైలు నంబరు 12968 జైపూర్-చెన్నై జైపూర్ ఎక్స్ప్రెస్ : ఈనెల 21, 23, 28, 30, వచ్చే నెల 5వ తేదీన రద్దు చేశారు.

రైలు నంబరు 12975: మైసూర్-జైపూర్ సూపర్ ఫాస్ట్ : ఈనెల 27, 29, జూలై 4, 6వ తేదీల్లో రద్దు చేశారు.

రైలు నంబరు 12976 : జైపూర్-మైసూర్ : సూపర్ ఫాస్ట్ ! ఈనెల 24, 26, జూలై 1, 3వ తేదీల్లో రద్దు చేశారు.

రైలు నంబరు 12539 : యశ్వంత్పూర్ -లక్నో: ఈనెల 26, జూలై 3వ తేదీల్లో రద్దు చేశారు.

రైలు నంబరు 12540 లక్నో- యశ్వంత్పూర్ : సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ : ఈనెల 28, 5వ తేదీల్లో రద్దు చేశారు.

రైలు నంబరు 12577 భాగమతి-మైసూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ : ఈనెల 25, జూలై 2వ

ప్యాసింజర్ రైలు – తేదీల్లో రద్దు చేశారు.

రైలు నంబరు 12578: మైసూర్ దర్భాంగా : సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ : ఈనెల 28, వచ్చే నెల 5వ తేదీన రద్దు చేశారు.

రైలు నంబరు 22619: బిలాస్పూర్- త్రివేం డ్రం : తిరునవెల్లి ఎక్స్ ప్రెస్ : ఈనెల 25, జూలై 2వ తేదీన రద్దు చేశారు.

రైలు నంబరు 22620: త్రివేండ్రం – బిలాస్పూర్ ఎక్సప్రెస్ : ఈనెల 23, 30వ తేదీల్లో రద్దు చేశారు.

రైలు నంబరు 22351 పాటలీపుత్ర-శ్రీమాతా వైష్ణో : ఈనెల 21, 28 జూలై 5వ తేదీన రద్దు చేశారు.

రైలు నంబరు 22352 : శ్రీమాతావైష్ణో-పాటలీ పుత్ర : ఈనెల 24, జూలై 1, 8వ తేదీల్లో రద్దు చేశారు.

- Advertisement -

Post bottom
Leave a comment